యాదవుల హృదయంలో రేవంత్‌ రెడ్డి ఎప్పటికీ నిలిచిపోతారు

` సదర్‌ను తెలంగాణ ప్రభుత్వ పండుగగా గుర్తించడంపై అఖిలేష్‌ యాదవ్‌ హర్షం
` సీఎం రేవంత్‌తో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి భేటి
హైదరాబాద్‌(జనంసాక్షి):యాదవ్‌లకు ఎంతో ఇష్టమైన సదర్‌ను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తిస్తు సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకోవడాన్ని అఖిలేష్‌ యాదవ్‌ ప్రశంసించారు. దేశంలోని యాదవ సమాజం రేవంత్‌ రెడ్డిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని ఆయన అన్నారు. యాదవుల హృదయంలో రేవంత్‌ రెడ్డి ఉండిపోతారని అఖిలేష్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.తెలంగాణ లో ని యాదవ వర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఇస్తున్నందుకు ఆయన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. నగరానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ను తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో అఖిలేష్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్‌కు రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ నేత రోహిన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిఎం రేవంత్‌తో ఆర్థికవేత్త సుబ్రమణియన్‌ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రముఖ ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ కలిశారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. అయితే వీరి భేటీలో ఇటీవలి ఫ్యూచర్‌ సిటీ, పెట్టుబడులు తదితర అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఇదిలావుంటే శనివారం నగరంలో జరగబోయే ’మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌’ అనేది ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌ అయినప్పటికీ రాహూల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా హాజరు కావాల్సిందిగా కోరినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఢల్లీి పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ బయలుదేరే ముందు ముఖ్యమంత్రి అక్కడి విూడియాతో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ ఈనెల 13న హైదరాబాద్‌ వస్తున్నారని.. ఓ ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని సీఎం చెప్పారు.ఈ కార్యక్రమానికి తననూ ప్రత్యేక అతిథిగా పిలిచారని.. అయితే ఇది ప్రభుత్వానికి సంబంధం లేని ఈవెంట్‌ అని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెస్సీతోపాటు లూయిస్‌ సువారెజ్‌, రోడ్రిగో డి పాల్‌ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటారు. అయితే, ఈ కార్యక్రమంలో మెస్సీ వర్సెర్స్‌ రేవంత్‌ రెడ్డి జట్లు 5 నిమిషాలపాటు మ్యాచ్‌ ఆడనున్నారు. మెస్సీతోపాటు ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.