సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి.

నడికూడ, డిసెంబర్ 14 (జనం సాక్షి):నడికూడ మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి కోడెపాక సుమలత కర్ణాకర్ మాజీ ఎంపిటిసి సమ్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సమక్షంలో వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ తల్లిలాంటి పార్టీ అని, ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే స్వభావం ఉన్న పార్టీగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు.మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పార్టీలో చేరిన నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విరక్తితో ఇప్పటికే భారీగా బీఆర్ఎస్‌లో చేరికలు జరుగుతున్నాయని, స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక మరింత మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.



