మెస్సీ`రేవంత్‌ జట్ల మధ్య నేడు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

` హాజరుకానున్న రాహుల్‌
` నేటి మ్యాచ్‌కు భద్రత కట్టుదిట్టం
` టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి: సీపీ
హైదరాబాద్‌(జనంసాక్షి): ‘మెస్సీ గోట్‌ ఇండియా టూర్‌’ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 13న రాత్రి 7గంటలకు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ మ్యాచ్‌కు టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని సూచించారు. 34 ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు మెస్సీ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే కార్యక్రమంలో, తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌, ఉప్పల్‌ స్టేడియం వరకు ప్రయాణించే మార్గాలు ఇప్పటికే ఖరారయ్యాయి. 13వ తేదీ రాత్రి కూడా ఫలక్‌నుమా ప్యాలెస్‌లోనే మెస్సీ బస చేయనున్నారు.