పెరిగిన విధ్యుత్ చార్జీలు నామ మాత్రమే: రైల్వేసహయ మంత్రి కోట్ల
హైదరాబాద్: పెరిగిన రైల్వే చార్జీలే కేవలం నామమాత్రమేనని రైల్వే సహయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ సారి రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రనికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీని పై త్వరలో ప్రజా ప్రతినిధులతోసమావేశం ఏర్పాటు చేసి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తీసుకుంటామని చెప్పారు. విశాఖ దక్షిణ మధ్య రైల్వే కలపాలన్న డిమాండ్ సహా 80 అంశాలను రైల్వే కమిటీ పరిశీలిస్తోందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.