పేదలకు గొడుగుల పంపిణీ

విజయనగరం, జూన్‌ 25 : డిసిసి జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ,మాతృమూర్తి లక్ష్మిదేవి వర్ధంతి సందర్భంగా సోమవారం ఉదయం కోలగట్ల నివాస గృహం వద్ద పట్టణానికి చెందిన 2,300 మంది పేదలకు ఉచితంగా గొడుగులను పంపిణీ చేశారు. అదే విధంగా స్థానిక చెవిటి, మూగ పాఠశాలకు చెందిన విద్యార్థులకు లక్ష్మీదేవి పేరుమీదుగా లక్ష రూపాయల విరాళాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామితో పాటు అతని సోదరులు కెవిఎన్‌ తమ్మన్నశెట్టి, కృష్ణారావులతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.