పేదలకు సేవ చేయడంలో ఐ వి ఎఫ్, ఆర్యవైశ్య సంఘం
పేదలకు సేవ చేయడంలో ఐ వి ఎఫ్, ఆర్యవైశ్య సంఘం ముందంజ తూప్రాన్ జనం సాక్షి నవంబర్ 23:: పేదలకు సేవ చేయడంలో ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ముందుంటుందని ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు పేర్కొన్నారు తూప్రాన్ లో అమావాస్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు ఇప్పటికే ఐ వి ఎఫ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాలలో అమావాస్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించామని తూప్రాన్ లో సమర్థవంతంగా నిర్వహించడానికి అమావాస్య అన్నదాన కార్యక్రమం చైర్మన్ ఉప్పల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతి అమావాస్య రోజు తూప్రాన్ లోని సుభాష్ చంద్ర బోస్ విగ్రహం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం చైర్మన్ ఉప్పల నాగరాజు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుక్క అశోక్ పట్టణ అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పల్లెర్ల బాలేష్ కొడిపాక టక్కయ్య ఐ వి ఎఫ్ పట్టణ అధ్యక్షులు ఉప్పల అశోక్ యూత్ అధ్యక్షులు నీల ప్రవీణ్ కోడి పాక నాగరాజు గబ్బుల సిద్ధిరాములు శ్రీధర్ బుక్క విజయ్ లక్ష్మణరావు శంకర్ ఐ వి ఎఫ్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు తూప్రాన్ పట్టణానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు అన్న ప్రసాదాన్ని అందజేశారు