పొంగులేటి కుమార్తె కళ్యాణ పత్రికలు, గోడ గడియారాలు ఇచ్చి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాయం

బూర్గంపహాడ్ ఆగస్టు05 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు తెరాస రాష్ట్ర నాయకులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె పొంగులేటి స్వప్ని రెడ్డి, అర్జున్ రెడ్డి ల కళ్యాణ ఆహ్వాన పత్రికల పంపిణీ కార్యక్రమాన్ని పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డిలు ప్రారంభిచారు. ముందుగా మండల కేంద్రంలోని  అభయాంజనేయ స్వామి దేవాలయం, శివాలయంలో ఆహ్వాన పత్రికను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే జమా మస్జిద్, అంబేద్కర్ కాలనీలోని బైబిల్ మిషన్ చర్చి నందు ఆహ్వాన పత్రికను ఉంచి ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రజక కాలనీలో పలువురికి వివాహా ఆహ్వాన పత్రికలు, గోడ ఘడియారాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపీపి కైపు రోశిరెడ్డి, కైపు శ్రీనివాసరెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, నల్లమొతు సురేష్, పుట్టి వెంకటేశ్వర్లు, కొండిబోయిన వీర్రాజు, దగ్గుబెల్లి ప్రభాకర్, సాని సోమయ్య, డేగల దర్మయ్య, సీర్ల భద్రమ్మ, కొండిబోయిన సత్యావతి, చిప్పా రాజు, కొమరగిరి శివ, ఎస్ కే పాషా, మందా నాగరాజు, పొంగులేటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.