పోలవరంలో రాకపోకలు నిలిపివేత

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తోంది. సీఎం పోలవరం పర్యటన సందర్భంగా భద్రత పేరుతో పోలీసులు పోలవరంలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని 25 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.