పోలవరం టెండర్ల వెనక కాంగ్రెస్‌ అధిష్ఠానం హస్తం : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: అర్హత లేని ట్రాన్స్‌ట్రాయ్‌ -యూఈఎన్‌ కంపెనీకి పోలవరం టెండర్లు కట్టబెట్టడం వెనుక కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం హస్తం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. యూఈఎన్‌ సంస్థ రష్యాలోని బ్యురియాగెస్ట్రాయ్‌, తజకిస్థాన్‌లోని సంగ్దుడా జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణం పేరుతో సమర్పించిన అనుభవపత్రాలు బోగన్‌పని తేలిందన్నారు రష్యా వెళ్లిన సాగునీటిశాఖ అధికారులకు  ఈ విషయాన్ని బ్యురియా గెస్ట్రాయ్‌ ఫిర్యాదు చేసిందన్నారు. బ్యురిస్కోయి హెచ్‌పీపీ విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శంచేందుకు జనవరి 30,31 తేదీల్లో రాష్ట్ర అధికారులను అనుమతించగా ఆ పని వదిలేసి ట్రాన్స్‌ట్రాయ్‌ ఆతిథ్యంలో రాడిసన్‌ హోటల్‌లో విందులు, విలాసాల్లో మునిగిపోయారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి స్వయంగా రాత్రికి రాత్రే అర్హతలు లేని కంపెనీకి అనుమతులు కట్టబెడుతూ సంతకాలు చేయడం అవినీతి పరాకాష్టకు చేరటమే అని విమర్శించారు. ట్రాన్స్‌ట్రాయ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టి, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు.  రష్యా వెళ్లి యూఈఎన్‌ ఆతిధ్యంలో గడిపిన రాష్ట్ర అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు.

తాజావార్తలు