పోలీసు శాఖ లో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు

హైదారాబాద్‌ : పోలీసు శాఖలో పదోన్నతుల వ్యవహారంలో భారీగా ముడుపులు తీసు కుంటున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు.ఓక్కోస్థాయి పోస్టుకు ఓక్కోలెక్క న వస్తున్నారన్న ఆయన పదేళ్లుగా పోలీసుశాఖ బదిలీలు,పదోన్నతులపై సమాచార హక్కుచట్టం కింద వివరాలు అడిగినట్లు తెలిపారు.ఆ వివరాలు అందాక హోంమంత్రి డీజీపీ ఇతర అధికారులు పారదర్శకంగా ఉన్నదీ లేనిది తేలుతుందని శంకర్రావు అన్నారు.పోలీసు శాఖతో పాటు కీలకమైన రెవేన్యూ పురపాలక పంచాయతీరాజ్‌ నీటిపారుదలశాఖ రవాణాశాఖల్లోను ఇదే రకమైన వ్యవహారం ఉందని బడుగులకు దళితులకు ప్రాధాన్యం లేదని ఆయనన్నారు.డీజీపీ విషయంలో క్యాట్‌ తీర్పు హార్షణీయమని ప్రభుత్వం దానిపై అప్పీలుకు వెళ్లరాదని శంకర్రావు వ్యాఖ్యానించారు.