ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోరుతున్నారు: అన్నాహజారే

న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే ప్రజు తమ నుంచి రాకీయ ప్రత్యామ్నాయం ఆశిస్తున్నారని అన్నా హజారే అన్నారు. ఈ రోజుతో అన్నా దీక్ష అయిదవరోజుకు చేరింది. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయపార్టీ పెట్టడంలో తప్పు లేదని దాని ద్వారానే మంచి ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌కు వస్తారని అన్నారు. అయితే తాను మాత్రం రాజకీయాల్లోకి రానని బయటినుంచే పోరాడతానని అన్నారు. బలమైన లోక్‌పాల్‌ బిల్లుకు ప్రభుత్వం సుముఖంగా లేదని ఆయన అన్నారు. రేపు దీక్షను విరమిస్తానని కూడా ఆయన అన్నారు.