ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం

విజయవాడ :  ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలో  ఈ నెల 7న నిర్వహించే ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో కాంగ్రెస్‌ నేతలెవరూ వైకాపాలోకి వెళ్తారని అనుకోవడంలేదన్నారు. ఆకరిద్దరు వెల్లినా పార్టీకి నష్టం లేదని అభిప్రాయపడ్డారు. మతోన్మాదం రెచ్చగొట్టేలా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఆది నేరమే అవుతుందన్నారు.