ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
45వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
సూర్యాపేట ప్రతినిధి , మార్చి15 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని 45వ వార్డు విద్యా నగర్ లో గండూరి రామస్వామి జానకమ్మ ఉచిత వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని మహిళల సంక్షేమం వారి ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు , కాలేజీలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.రాష్ట్రంలో నిర్వహిస్తున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లు, ప్రజల సహకారంతో విజయవంతమైందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు గండూరి కృపాకర్ నిత్యం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వార్డు ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారని ప్రశంసించారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా
మహిళల ఆరోగ్యం కోసం కేటాయించారని, ఆ రోజున మహిళలు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రామాంజుల రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, జిల్లా నాయకులు గండూరి కృపాకర్, నూకల వెంకటరెడ్డి, బండారు రాజా, గోపగాని గిరి, మిట్టపల్లి రమేష్, రాచకొండ శ్రీనివాస్, జూలకంటి నాగరాజు, తెరటపల్లి సతీష్ , బెజగం ఫణి, పిశిక సువర్ణ, మురారిశెట్టి జోగయ్య, మేడిగ రమేష్ , సానిటరీ ఇన్స్పెక్టర్ జనార్దన్ రెడ్డి, మెప్మా పిడి రమేష్ నాయక్, వార్డు ఆఫీసర్ ఉపేంద్రచారి, జవాను కొండేటి వెంకన్న, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ అఫ్రిన్, రోజారాణి , ఉపేంద్ర, మనోహర్,రమ్య, ఎఎన్ఏంలు విజయ,మాధవి,ఆర్పీ విజయ, కుక్కడపు సాలయ్య, భిక్షం, సందీప్, వెంకటేష్, కళ్యాణ్, ఇస్మాయిల్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.