ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

కోల్‌సిటి, జూన్‌ 26, (జనం సాక్షి)  రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ప్రజావాణిలో ప్రజలు తమ వార్డులకు సంబంధించిన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై దరఖాస్తులను అధికారులకు అందించారు. కమిషనర్‌ ఆయా శాఖలకు దరఖా స్తులను పరిష్కారం కోసం బదిలీచేశారు. అధికారులకు దరఖాస్తులను అందించడానికి ప్రజలు బారులు తీరారు. ఎన్టీపీసీలోని భీమునిపట్నం అంబేడ్కర్‌కాలనీలో చేతిబోర్‌పంపులు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తు తెలంగాణ యువజన సంఘాల సమితి బాధ్యులు కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్య క్రమంలో సంఘ బాద్యులు గోలివాడ ప్రసన్న కుమార్‌, రెవెల్లి లక్ష్మణ్‌, దామెరకుంట నరేష్‌, వెంకటేష్‌, అభిషేక్‌, రాకేష్‌, సత్యసాయి, శ్రీనివాస్‌, రమేష్‌, సురేష్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, 17వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గతంలో ఎన్నోమార్లు విన్నవించినప్పటికి పరిష్క రించకపోవడం పట్ల టిఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ ఏరియా ప్రధానకార్యదర్శి పిల్లి రాజమౌళి ఆధ్వ ర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అధికారులకు విన తిపత్రం సమర్పించారు. ఈ నిరసన కార్య క్రమంలో నాయకులు కనుకుంట్ల రమేష్‌, గోపా లకృష్ణయాదవ్‌, తిమోతి, సతీష్‌, సుజయ్‌, అయి లయ్య, శ్యాం తదితరులు పాల్గొన్నారు.