‘ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం’

ఆదిలాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి):  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని రైతు సంఘం కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం రోజురోజుకు ధ రలను పెంచుతూ సామాన్యులపై భారం మోపుతుందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ తమ విధా నాలను మార్చుకోకపోతే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఈ నెల 17వ తేదీన బెల్లంపల్లిలో సిపిఐ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో రైతులు, పేద ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, విదేశీ బ్యాంకుల్లో ములు గుతున్న నల్ల ధనాన్ని దేశానికి రప్పించడం వంటి అంశాలపై ఈ సభలో చర్చించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సభకు సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.