*ప్రజాస్వామ్యం ప్రణవిల్లాలి*

ఊరూరా ప్రచారాలు
ఆగిపోయాయి
ఓటు ఓటుకు నమస్కారాలు నిలిచిపోయాయి!
ఓట్లన్నీ భద్రంగా పెట్టెలల్లో
రక్షణగా పోలీసుల కాపలాలు
స్వపక్షం ఓట్లు విపక్షం ఓట్లు
కలిసి మెలిసి ఒకే పెట్టెలో!
తెలుసుకొని మెలగాలి నాయకులు
కలిసి మెలిసి ఉండాలి ప్రజలు
అదే కదా ప్రజాస్వామ్యం
అప్పుడే ప్రణవిల్లును ఎల్లకాలం!!
జగ్గయ్య.జి
9849525802