ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

కడప, జూలై 25 : నగర పాలక సంస్థ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య బుధవారం అన్నారు. ధనార్జనే ధ్యేయంగా మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నగర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతుంటే కమిషనర్‌కు చీమకుట్టినట్లు లేదని విమర్శించారు. ప్రజల సమస్యల పట్ల దృష్టి పెట్టకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. నగర పాలక సంస్థ అవినీతికి నిలయంగా మారిందని దుయ్యబట్టారు. చేతులు తడపనిదే ఏ ఒక్క పని సాపీగా జరగడంలేదని అన్నారు. సమస్యల పట్ల స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని ఈశ్వరయ్య హెచ్చరించారు.