ప్రణబ్‌ తెలంగాణ వ్యతిరేకి

శ్రీప్రణబ్‌కు ఎవరు ఓటేసినా తెలంగాణను వ్యతిరేకించినట్లే ,
శ్రీరిపోర్టు ఇవ్వని ప్రణబ్‌ కమిటీ..,
శ్రీ రాష్ట్రపతి ఎన్నిలకు సీపీఐ దూరం : నారాయణ
గోదావరిఖని, జూన్‌ 24, (జనం సాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని ప్రక్కతోవ పట్టించి ప్రణబ్‌ కమిటీ రిపోర్టును ఇప్పటివ వరకూ ఇవ్వని ప్రణబ్‌ముఖర్జి ముమ్మాటికీ తెలంగాణ వ్యతిరేకే అని ఆయన అభ్యర్థిత్వాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని… సీపీఐ రాష్ట్ర కార్య దర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. ఆదివారం స్థానిక భాస్కర్‌రావు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రణబ్‌ ముఖర్జీకీ ఎవరు ఓటు వేసినా తెలంగాణ వ్యతిరేకులే అవుతారని అన్నారు. తెలంగాణ ఇంతకాలంగా నానడానికి ప్రణబే కారణమన్నారు. తెలంగాణ అంశాన్ని కేంద్రప్రభుత్వం ముందుకు తీసువచ్చి… మళ్ళీ వెనుకకు మళ్ళీంచిన విష యంలో ప్రణబ్‌ముఖర్జీ ప్రధానపాత్ర పోషించార న్నారు. తెలంగాణ విషయం పరిష్కరించడంలో కాంగ్రెసఊగిసలాడుతోందని… పరకాల ఉప ఎన్నికలతో పాటు ఇతర నియోజక వర్గాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ఘోరపరాజయాన్ని పొందటానికి ఈ అంశానికి పరిష్కారం చూపకపోవడమేనన్నారు. తెలంగాణ విషయం కాంగ్రెస్‌ మెడకు చుట్టుకున్నదన్నారు. అవినీతి రాష్ట్రప్రభుత్వంలో రాజ్యమేలుతున్నదని… ఒక మంత్రి జైలులో ఉండగా… మరికొంతమంది మంత్రులపు అవినీతి ఆరోపణలున్నాయని… విచారణ జరుగుతున్న క్రమం కూడా ఉందన్నారు. కళంకిత మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించండానికి కూడా… వెనుకడుగు వేస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్‌ విధానం జంతర్‌మంతర్‌గా ఉందని… లాటరీ పద్దతి చూస్తే… గతంలో కంటే దోపిడి మరింత జరిగే అవకాశం ఉందన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ఈ విధానంలో మళ్ళీ మధ్యం సిండికేట్‌లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని… అక్రమ సంపాదన ఉంటుందని… మధ్యం మాఫియాలు ఆవిర్భవిస్తాయన్నారు. దీనిపై తమపార్టీ ఉద్యమించడానికి సిద్దంగా ఉందన్నారు. సిపిఎం, లోక్‌సత్తా తోడు రానున్నదన్నారు. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇతర పార్టీలు కూడా కలిసిరావాలని కోరారు. ఆరవ దఫా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న భూపంపిణీ విధానాన్ని ప్రభుత్వం మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ఐదు దఫాల్లో ఇచ్చిన భూమిపట్టాలు ప్రజల చేతుల్లో ఉండగానే… పంపిణీ చేసిన స్థలాల విషయంలో రెవెన్యూ – ఫారెస్ట్‌ విభాగాల మధ్య వివాదం కొనసాగుతున్నదని… వైఎస్‌ నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు తమ పార్టీ భూ పంపిణీలో ఉన్న లోపాలను సవరించాలని కోరామన్నారు. మరోసారి ఈ భూపంపిణీ కార్యక్రమాన్ని చిత్తశుద్దితో కాకుండా జనాన్ని మోసం చేసే… తరహాలో ఆర్భాటం కోసం ప్రభుత్వం నిర్వహించనున్నదన్నారు. కాగా, తెలంగాణ త్యాగధనులతో కూడిన ఏఐటియుసిని సింగరేణిలో జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించాలని, ఇతర సంఘాలతో జరగని ప్రయోజనాలు ఈ సంఘంతో కార్మికులకు జరుగుతుందన్నారు. కార్మికులు తమ సంఘం వైపు మొగ్గు చూపుతున్నదని, ఎన్నికల్లో ఏఐటియుసి గెలుస్తున్నదని నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ శాసనసభ పక్షనేత గుండా మల్లేష్‌, నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, మర్రి వెంకట్‌స్వామి, వాసిరెడ్డి సీతారామయ్య, వై.గట్టయ్య, మిర్యాల రంగయ్య, ఎం.నారాయణ, ఎల్‌.రామయ్య, దయాకర్‌రెడ్డి, వేల్పుల నారాయణ, కె.స్వామి, సిహెచ్‌.జాకబ్‌ తదితరులు పాల్గొన్నారు.