ప్రణబ్‌ న్యాయం చేయగలరు: మేకపాటి

హైదరాబాద్‌: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ బలపరిచిన అభ్యర్థులకే తమ  ఓటు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజ్యాంగ అధినేతగా ప్రణబ్‌ముఖర్జీ అందరికీ న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రణబ్‌ వ్యవహరిస్తారనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.