ప్రణబ్‌ పై మరోసారి అన్నా బృందం ధ్వజం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ పడుతున్న కేంత్ర మంత్రి ప్రణబ్‌ముఖర్జీపై అన్నా బృందం మరోసారి విరుచుకుపడింది. ఆయన పై ఉన్న ఆరోపణలను స్వతంత్ర సంస్థ విచారణలో నిగ్గు తేల్చాల్సిందేనని పునరుద్ఘాటించింది. 15 మంది కేంత్ర మంత్రుల పైఉన్న అవినీతి ఆరోపణల గురించి తాము రాసిన లేఖ తనకు చేరలేదంటూ ప్రణబ్‌ముఖర్జీ బుకాయిస్తుండడం విడ్డూరమని పేర్కొన్నారు. ఆ లేఖను ప్రతీమంత్రి కార్యాలయంలోనూ స్వయంగా అందజేశామని. లేఖ ముట్టినట్లుగా ఆయన కార్యాలయంకు ఇచ్చిన ప్రతి కూడా తమ వద్ద ఉందని అన్నా బృంద సభ్యులు పేర్కొన్నారు. ప్రణబ్‌ సహమంత్రులైన సల్మాన్‌ ఖుర్షీద్‌,ఎన్‌.ఎం.కృష్ణ వింటి వారికి లేఖ అందినపుడు ప్రణబ్‌ మాత్రం ఎందుకు అందలేదంటూన్నారు.