ప్రణాళికా బద్ధంగా చదివితే విజయం మీదే.

 

 

 

 

 

 

 

 

ప్రీన్సిపల్ డా. మహమ్మద్ ముబీన్

కోటగిరి మార్చి 15 జనం సాక్షి:-పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివి విజయవంతం కావాలని కోటగిరి టెమ్రీస్ కళాశాల ప్రిన్సిపల్ డా. మహమ్మద్ ముబీన్ పేర్కొన్నారు.మండల కేంద్రంలో ని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర కళాశాలలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న 89 విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్సిల్స్,పెన్స్,స్కేల్స్, షాప్నర్స్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా. ముబీన్ మాట్లాడుతు.విద్యార్థులు పట్టుదల,ప్రణాళి కతో చదివి,మంచి ర్యాంకులు సాధించి కళాశాలకు గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు.పరీక్షల సందర్భంగా విద్యార్థులకు (ఆల్ ది బెస్ట్) శుభాకాంక్ష లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ వార్డెన్ ఆభిద్ పాష,లెక్చరర్ లింగం,అబ్దుల్ కురేశి, బాల గంగాధర్,సంతోష్,కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.