ప్రతిభావంతులైన ముస్లీం విద్యార్థులకు ‘నామ్‌’ సన్మానం

హైదరాబాద్‌ : నేషనల్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ముస్లీం ఫౌండేషన్‌ ఈ రోజు హైదరాబాద్‌ లోని మెహదీపట్నం లో మెరుగైన ప్రతిభ చూపిన ముస్లీం విద్యార్థులను బంగారు పతకాలతో సన్మానించింది. క్రిస్టల్‌ గార్టెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నామ్‌ సంస్థ తరపున ఉర్దూ, ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్న ముస్లీం బాలబాలికలు హాజరయ్యారు. ముస్లీం సమాజాన్ని అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి రావాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నామ్‌ ఫౌండేషన్‌ సయ్యద్‌ జమీలుద్దీన్‌ కోరారు.