ప్రధాని కార్యాలయంలో నకిలీ మెయిల్ సృష్టించిన ఆగంతుకుడు
ఇస్లామాబాద్: ప్రధాని పేరిట వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ మెయిల్ పాకిస్థాన్‌లో కలకలం సృష్టించింది. ప్రధాని రక్షణ దినోత్సవ సందేశం పేరిట ఓ నకిలీ మెయిల్ పాత్రికేయులకు చేరింది. ఇది తరచూ ప్రధాని కార్యాలయం నుంచి మీడియకు పంపే మెయిల్ అడ్రస్‌లాగే ఉండలంతో అందరూ అది ప్రధాని సందేశమనే భావించారు. జరిగిన తప్పును తెలుసుకున్న ప్రధాని కార్యాలయ వర్గాలు ఫేక్ ఐడీ నుంచి వచ్చిన ఆ సందేశాన్ని పటించుకోవద్దని ప్రధాని ఎలాంటి సందేశాన్ని పంపలేదని జర్నలిస్టులకు తెలిపారు. ప్రధాని కార్యాలయ మెయిల్ ఐడీల్లో ఒకదానికి ‘ఆర్’ అనే అక్షరాన్ని జతచేసి ఆగంతుకుడు నకిలీ మెయిల్ సృష్టించాడని అధికారులు తెలిపారు.