ప్రధాని నివాసం వద్ద నిరసన..కేజ్రీవాల్‌ అరెస్టు

న్యూఢిల్లీ: ప్రధాన నివాసం వద్ద నిరసనకు సిద్ధమైన అన్నాహజారే బృందం సభ్యుడు అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆయన మద్దతుదారులు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొగ్గుకుంభకోణానికి వ్యతిరేకంగా ప్రధాని, సోనియా, గడ్కరీ నివాసాల వద్ద ధర్నాకు కేజ్రీవాల్‌ సిద్ధమవుతుండగా ముందస్తు చర్యలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.