ప్రధాని నివాస ముట్టడికి భాజపా యత్నం: అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: తెలంగాణపై  కేంద్రం వైఖరిని తెలియజేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ప్రధాని నివాస ముట్టడికి భాజపా యత్నించింది. పెద్దసంఖ్యలో ప్రధాని అడ్డుకున్నారు. వాటర్‌ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసులను ప్రతిఘటిస్తూ కొందరు కార్యకర్తలు ముందు కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు.