ప్రభుత్వం ఉద్యమ కారులను అణచివేయడాన్ని నిరసిస్తూ రేపు నిరసన దీక్ష: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై నిలకడగా ఒత్తిడి పెంచగలిగామని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లరి మూకను అణిచివేశామన్న ఆలోచనలో ఉన్నాయని, సమస్య పరిష్కారంపై మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. కవాతు సందర్భంగా పరిష్కారంపై మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. కవాతు సందర్భంగా ప్రభుత్వం ఉద్యమ కారులను అణచివేయడాన్ని నిరసిస్తూ రేపు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద నిర&ఇహించాల్సిన దీక్షను ఉదయం పది గంటలనుంచి సాయంత్రం వరకు బాసూ ఘాట్‌వద్ద నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. తమలోను కొందరు ఆధ్రా పాలకుల ఏజెంట్లు ఉన్నారని, ఉద్యమానికి మచ్చమానికి మచ్చతెచ్చేలా హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు.