ప్రభుత్వం కూలిపోవడం ఖాయంన నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాంపై కేసులు పెడితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ మార్చ్‌కు సీపీఐ మద్దతిస్తుందని  స్పష్టం చేశారు. తెలంగాణపై సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహితంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పవిత్రమైన అసెంబ్లీని సీఎం అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. వికలాంగులకు పెన్షన్‌ పెంచాలని అక్టోబర్‌ 2న ఆందోళనలు చేపడుతామని ఆయన తెలియజేశారు.