ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటున్న బంధువులు

జగిత్యాల టౌÛన్‌,మే26(జనంసాక్షి) :
జగిత్యాల పట్టణ గాంధీనగర్‌ కు చెందిన బొక్కెన రాజమ్మ ప్రసవం కోసం స్తానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం చేరి బాబుకు జన్మనిచ్చిం ది. ఐదు రోజులు గా ఆసుపత్రిలో ఉంటున్న రాజ మ్మ శనివారం రోజు మరణించింది .తన భార్య రాజమ్మ మృతి కి కారణం కేవలం వైద్యుల నిర్లక్ష్య ం అని మృతురాలి భర్త సాయిలు మరియు బందు వులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. డాక్టరలను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్డీవో యం హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకుని వారిని పరా మర్శించారు. పట్టణ ఇంచార్జ్‌ సీఐ గౌస్‌బాబా ఎస్సై శీను నాయక్‌ ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని శాంతింపజేశారు. మృ తురాలికి ఇది ఐదవ సంతానం జిల్లా కలెక్టర్‌ ప్రస వాల కొరకు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌక ర్యాలు కల్పిస్తున్నట్లు ప్రసవాలు ప్రభుత్వాసు పత్రి లో చేయించుకోవాలని ప్రకటనలు చేస్తుండ ప్రభు త్వ డాక్టర్లు మాత్రం తమ తీరు మార్చు కోవడం లేదని వెల్లడించారు.