ప్రభుత్వ ఉద్యోగులకు తమిళ సర్కార్‌ వరాలు

చెన్నై:తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించింది.సీఎం జయలలలిత ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు.వారికి ప్రస్తుతం ఆరోగ్య బీమా కింద ఇస్తోన్న మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు.ఉద్యోగులకు గృహ నిర్మాణానికి ఇస్తోన్న మొత్తాన్ని రూ.15లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచారు.ఉన్నతాధికారులు ప్రస్తుతం తీసుకుంటోన్న వ్యక్తిగత రుణ పరిమితి రూ.25లక్షల నుంచి రూ 40. లక్షలకు పెంచారు.