ప్రముఖ కవి కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి పలువురు సంతాపం

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : ప్రముఖ కవి, సాహితీవేత్త, పద్యకవి తెలుగు పండితుడు కల్వకుంట్ల రఘనాథాచార్య మృతికి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ సంతాపం తెలిపింది. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పండిత పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.నర్సింహాచార్య మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇలావుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు