ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ దాడి

హైదరాబాద్‌: నగరంలోని అంబర్‌పేట ా’ా నంబర్‌ కూడలి వద్ద ఆర్టీసీ బస్సులో ఘర్షణ చోటు చేసుకుంది. సిగ్నల్‌ వద్ద బస్సు ఆపాలంటూ ఓ ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో వాదనకు దిగింది. అందుకు ఆగ్రహించిన బస్సు డ్రైవర్‌ మహిళా ప్రయాణికురాలిపై రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.