ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వసతులు

శ్రీకాకుళం, జూలై 28 : రైల్వే ప్రయాణికులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని భువనేశ్వర్‌ డివిజన్‌ సీనియర్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎం.ఎన్‌.ఎస్‌.రే పేర్కొన్నారు. శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైళ్లు నిలయాన్ని ఆయన శనివారం నాడు పరిశీలించారు. ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఫ్లాట్‌ ఫాంపై తాగునీటిని పరిశీలించి కలుషిత నీటి పంపిణీ చేయరాదని, తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయాలని సూచించారు. రాత్రి వేళ్లలో ఫ్లాట్‌ఫాంలపై విద్యుత్‌ దీపాలు, పంకలు వేసి ఉంచాలని ఆదేశించారు. ఫ్లాట్‌ ఫాంలపై పైకప్పుల నిర్మాణ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన రైల్వే పరుసల్‌, బుకింగ్‌, రిజర్వేషన్‌, గూడ్స్‌ కార్యాలయాలను తనిఖీ చేశారు. రైల్వే ఉన్నతాధికారులు ఉన్నారు.