ప్రశాంతంగా ముగిసిన సింగరేని కార్మికసంఘం ఎన్నికలు

ఖమ్మం :   సింగరేని గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగ ముగిసినాయి. దాదాపు 90శాతం పోలింగ్‌ నమోదయినట్లుగ తెలుస్తుంది. ఓట్ల లెక్కింపు ఏడు గంటలనుండి ప్రారంభం కానుంది. రాత్రి 12గంటల వరకు పూర్తి స్థాయి ఫలాతాలు వెలువడనున్నాయి.ప్రాంతాల వారిగ పోలింగ్‌ శాతం.  కొత్తగూడెం..95, ఇల్లెందు..97.8, శ్రీరాంపూర్‌ 94.4, మందమర్రి 94.8 భూపాలపల్లీలో 95.7 శాతం పోలింగ్‌ నమోదయింది.