ప్రశ్నపత్రాలను ఎగ్జామ్ చీఫ్ సూపరిండెంట్ సమక్షంలోనే ఓపెన్ చేయాలి
-జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్…
నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి17(జనంసాక్షి):ఇంటర్మీడియట్ పరీక్ష ప్రశ్నపత్రాలను నిర్దేశించిన సమయానికే తెరవాలని,ప్రశ్నపత్రాలను తెరిసే సందర్భంలో సీల్ తీసేటప్పుడు తప్పనిసరిగా చీఫ్ సూపరింటెండెంట్లు,డిపార్ట్మెంటల్ అధికారులు తప్పనిసరిగా హాజరై సీసీ కెమెరాల సమక్షంలోనే ఓపెన్ చేయాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు.ప్రశ్నపత్రాల బహిర్గతం చేయడం మరియు చూచిరాతకు ఆస్కారం లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.శుక్రవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీనివాస పద్మావతి జూనియర్ కళాశాల,బిజినపల్లి మండలం పాలెం శ్రీవెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో కొనసాగుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.నిన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీషు పరీక్షలు జరుగుతుండగా కలెక్టర్ పర్యవేక్షించారు.నిఘా నేత్రాల ఏర్పాటు,సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించారు.శ్రీనివాస పద్మావతి,శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల పాలెం పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు కళాశాలల ప్రిన్సిపాల్స్ విద్యార్థుల హాజరు వివరాలు,ఏర్పాటు చేసిన వసతుల పై కలెక్టర్ కి వివరించారు.శ్రీనివాస పద్మావతి పరీక్షా కేంద్రంలో 384విద్యార్థులకు గాను 371మంది హాజరు కాగా 13మంది గైర్హాజరు అయ్యారు.అదేవిధంగా పాలెం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో 300మంది విద్యార్థులకు గాను 284మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 16మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ తెలిపారు.అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 31పరీక్షా కేంద్రాలలో నేటి ఇంటర్ మొదటి సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 6161మంది విద్యార్థులకు గాను 5804మంది విద్యార్థులు నేటి పరీక్షల హాజరయ్యారు.357 మంది విద్యార్థులు నేటి పరీక్షలకు గైర్హాజర్ అయినట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి వెంకటరమణ కలెక్టర్ కు వివరించారు.కలెక్టర్ వెంట డిఐవిఓ వెంకటరమణ,డిపిఆర్ఓ సీతారాం,హైదరాబాద్ ఇంటర్ బోర్డు అధికారులు విశ్వేశ్వర్,సాగర్,షరీఫ్,ఫ్లయింగ్ స్కాడ్ ప్రభాకర్ వర్ధన్ రెడ్డి,ఆయా కళాశాలల ప్రిన్సిపల్లు ఆనంద్ గౌడ్,అనసూయ జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.