ప్రసాద్‌ బెయిలు పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌:  ఎమ్మార్‌ ప్రాపర్టీన్‌ అవకతవకల కేసులో కీలక నిందితుడు కోనేరు రాజేంద్రప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ కోనేరు రాజేంద్రప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్టు చేసి చార్జ్ణిషీటు కూడా దాఖలు చేసిందున బెయిలు మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ కోనేరు పిటిషన్‌ దాఖలు చేశారు.దీనిపై కోనేరు తరపు వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సముద్రాల గోవిందరాజులు కోనేరు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.