ప్రాణాలను పణంగా పెట్టి…త్రివర్ణతాకాన్ని కాపాడి…

ముంబయి:ఒక పక్క ఎర్రగా..భగభగ…మండతూ కార్యాలయం తగలబడిపొతోంది.మరోపక్క నల్లని దట్టమైన పొగ వూపిరి అడనివ్వడం లేదు.ఆ సమయంలో అక్కడున్నవారికి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడినుంచి బయటపడడమెలా అన్న ఆలోచన తప్ప మరోటి రాదు,కానీ కొందరికి వచ్చింది.ప్రాణాం సంగతి తర్వాత ముందు జాతి పతాకాన్ని కాపాడుకోవాలనుకున్నారు వాళ్లు.ముంబయిలోని మంత్రాలయ భవనంలో అగ్నిప్రమాదం సంభవించినపుడు కొందరు ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పైకి వెళ్లి జాతీయ పతాకాన్ని గట్టిగా పట్టుకున్నారు.మంటలు పై అంతస్తులకు వ్యాపిస్తున్నా  వారక్కడినుంచి కదల్లేదు.జాతీయ పతాకంతో సహ వారిని భద్రంగా అగ్నిమాపక సిబ్బంది  కిందికి తీసుకొచ్చారు.