ప్రేమతత్వాన్ని బోధించేదే భాగవతం

 

జగిత్యాల (విద్యానగర్‌) : ప్రేమతత్వాన్ని బోధించేదే భాగవతమని సింహచలంలోని శ్రీవెంకటాచార్య వైదిక సంస్థాన్‌ ప్రవచకులు సాకులూరు గోపాలకృష్ణమాచార్య అన్నారు. శనివారం అయన జగిత్యాలలోని శ్రీవేణుగోపాలస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో అయన మాట్లాడుతూ శాంతియుతమైన జీవన విధానాన్ని అలవరుచుకునేందుకు భాగవతం దోహద పడుతుందాన్నారు వేణుగోపాల స్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు నంభి వేణుగోపాలచార్య కౌశిక స్వామి వారిశేష వస్రాలతో అయనను అశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పి. రవీందర్‌ , టీవీ సూర్యం తదితరులు పాల్గోన్నారు.