ప్లాస్టిక్‌ కవర్లలో మృతదేహం ముక్కలు

విశాఖ: విశాఖ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్‌ కవర్లలో కుక్కి దుండగులు రైల్వే స్టేషన్‌లో పడేశారు. మూడు ప్లాస్టిక్‌ కవర్లలో మృతదేహం ముక్కలను సోమవారం ఉదయం గుర్తించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఫ్లాట్‌ఫాం నెం.5పై కవర్లను గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు రైల్వేపోలీసులకు సమాచారమందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవర్లలో మృతదేహం ముక్కలను గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవపరీక్షల కోసం కవర్లను కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించారు.