ఫిర్యాదుల పరిష్కారానికి తేదీల ఖరారు

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):  ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం తేదీలను జిల్లా కలెక్టర్‌ అశోక్‌ ఖరా రు చేశారు. ఈ నెల 11వ తేదీన ఉట్నూరులోని ఐటిడిఎ కార్యాలయంలో, 18వ తేదీన మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో, 25వ తేదీన ఆసిఫాబాద్‌ కార్యాలయంలో, జూలై 2వ తేదీన ఆదిలాబాద్‌ కలె క్టర్‌ సమావేశ మందిరంలో, 9వ తేదీన నిర్మల్‌ ఆర్డీవో, ఫిర్యాదుల విభాగం జరుగుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమాల్లో జిల్లా స్థాయి అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.