బంద్‌ కారణంగా ఆర్టీసీకి రూ. 7కోట్లు నష్టం

హైదరాబాద్‌: బంద్‌ కారణంగా ఆర్టీసీ రూ.7కోట్ల రాబడి కోల్పోయింది. ఇవాళ ఉదయం నుంచే అన్ని బస్‌ డిపోల్లో విపక్ష నేతలు బస్సులను అడ్డగించారు. ఫలితంగా మధ్యాహ్నం వరకూ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. మొత్తం 3వేల 678 బస్‌ సర్వీసులను రద్దుచేసినట్లు అధికారులు తెలిపారు.