బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

ఖైరతాబాద్: సెప్టెంబర్ 23 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి అభివృద్ధికి పథకాలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానాన్ని కల్పిస్తున్నట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ లో సిఎంటిఇసిలో ఏర్పాటు చేసిన  చీరల పంపిణీ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తో పాటు సర్కిల్ – 18 డిసి రజనీకాంత్ రెడ్డి పాల్గొని చీరల పంపిణీ  చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు బతుకమ్మ పండుగ చిరు కానుకగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజలు బతుకమ్మను పండుగను  ఆనందోత్సవాలతో జరుపుకోవలనే సంకల్పంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా చీరలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు జరుపుకునే పండుగ ను మహిళలు సమిష్టిగా, సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసి పరిధిలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ చీరలు 1347 రేషన్ షాపుల అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.