బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

తాళ్లూరు, జూలై 18 : మండలంలోని లక్కవరం గ్రామంలో గల మండల పరిషత్‌ ప్రాధమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన ఇద్దరు ఉపాధ్యాయులను బుధవారం ఎంఇఓ కృష్ణకుమారి సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసిన ఎ శ్రీనివాసరావు, వి కోటేశ్వరరావు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఇఓ కృష్ణకుమారి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ పనిపట్ల అంకితభావంతో పనిచేసినప్పుడు గుర్తింపు లభిస్తుందని ఆమె తెలిపారు. ఇక్కడి నుండి బదిలీ అవుతున్న శ్రీనివాసరావు, కోటేశ్వరరావులు అంకితభావంతో పనిచేశారని, మంచి ఉపాధ్యాయులుగా మన్ననలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పి శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సావిత్రి, పాఠవాల సహ ఉపాధ్యాయులు ఎస్‌ రామ్మోహన్‌రెడ్డి, శ్రీమన్నారాయణ, జగన్‌, కోటిరెడ్డి, మాధవి, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.