బయోడైవర్శిటీ సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్ష

హైద్రాబాద్‌: అక్టోబర్‌ 1 నుంచి 19 వరకు హైద్రాబాద్‌ వేదికగా జరగనున్న బయోడైవర్శిటీ సదస్సు ఏర్పాట్లపై సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఈ రోజు సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైద్రాబాద్‌లో జరిగే అతి పెద్ద అంతర్జాతీయ కార్యక్రమం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదస్సు మొదలయ్యేలోగా ఎలాంటి లోటుసాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, సంబంధిత అధికారులకు ముక్యమంత్రి ఆదేశాలిచ్చారు. ఈ సదస్సుకు 193 దేశాల నుంచి 8వేలకు పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఈ సదస్సులో భాగంగా అక్టోబర్‌ 17 నుంచి 19 వరకు అత్యున్నత స్థాయి కార్యక్రమాలు జరగనున్న దృష్ట్యా పలు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.