బయోమెట్రిక్‌ విధానం ద్వారా జనగణనకు రంగం సిద్ధం

నెల్లూరు, జూలై 18 : బయోమెట్రిక్‌ విధానంలో జనాభ గణన చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఈ పద్దతిలోనే నివేశన కార్డు జారీని కూడా చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ జనన రిజిస్టార్‌ నిర్ణయించింది. ఈమేరకు జనాభ గణన రాష్ట్ర డైరెక్టర్‌ వై.వి. అనురాధ గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తూ బయోమెట్రక్‌్‌ విధానం ద్వారా జనాభ గణనపై అధికారుల్లో అగాహన కలిగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారంనాడు నెల్లూరు జిల్లా నాయకుడుపేటలో పర్యటించిన ఆమె బుధవారంనాడు నెల్లూరులో జరిగే జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారుల సమక్షంలో సమీక్ష్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2010 జనన గణన ప్రకారం జిల్లాలో 29 లక్షల 66 వేల 82 మంది ఉన్నట్టు తెలిపారు. వీరంత 7 లక్షల 76 వేల 324 కుటుంబాలు ఉన్నట్లు తాజ గణం వివరాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. బయోమెట్రిక్‌ విధానంలో రేషన్‌ కార్డులను, నివేశ స్థలాలను పంపిణీ చేయడం కోసం ప్రజల వేలి ముద్రలు, ఫోటో గుర్తింపు కార్డు వంటి వివరాలను సేకరిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో 600 కుటుంబాలకు కలిపి ఒక బయోమెట్రక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ఆమె తెలియజేశారు.