బళ్లారి అక్రమ మైనింగ్‌ స్పందించిన ‘సుప్రీం’

న్యూఢిల్లీ: కర్ణాటకలోని  బళ్లారి అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. అక్రమ మైనింగ్‌పై విచారణ చేయాలన్ని సీబీఐని కోర్టు ఆదేశించింది.ఆరు వారాల్లోగా దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షంచాలని తెలిపింది. దర్యాప్తులో ప్రభుత్వ సంస్థలు జోక్యం చేసుకోరాదని హెచ్చరించింది. 50 లక్షల టన్నుల ముడి ఇనుము ఎగుమతి చేసినట్లు కోర్టు అంచనా వేసింది. అక్రమ మైనింగ్‌ విషయం ప్రభుత్వానికి తెలియదా అని కోర్టు ప్రశ్నించింది.