బస్టాండ్‌ ఆట స్థలంగా తయారైంది

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : బిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో గల జి.యం.ఆర్‌ నిర్మించిన రోడ్డు ప్రక్కలో ఉన్న బస్టాండ్‌ విద్యార్థులకు మరియు రైతులకు, ప్రజలకు ఉపయోగపడే జీఎంఆర్‌ బస్టాండ్‌ క్యారంబోర్టు ఆడుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడకుండా పోతుంది. దీనికి వెంటనే జీఎంఆర్‌ వారు వెంటనే స్పందించాలని ప్రజలు జీఎంఆర్‌ను కోరుతున్నారు. దీనిని బస్టాండ్‌ను పట్టించుకోకుండా పోవుడం వలన ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.జంగంపల్లి గ్రామంలో జీఎంఆర్‌ నిర్మించి రోడ్డు ప్రక్కన ప్రమాదంతో అనుకోని ఉన్న జీఎంఆర పనితీరు బావి చుట్టు అడ్డు కంచా వేయకపోవడం వలన ప్రజలు కాలి జారీ పడే ప్రమాదం కూడ కలదు.