బస్సుల సంఖ్య పెంచాలని పూడురులో విద్యార్థుల రాస్తారోకో

కొడిమ్యాల: కొడిమ్యాల మండలం పూడురు ప్రదాన రహదారిపై విద్యార్థులు ఆర్టీసీ ఆర్డీనరీ బస్సులు పెంచాలని కోరుతూ రాస్తారోకో చేశారు. వివిధ గ్రామాల ఇంటర్‌,డిగ్రీ విద్యార్తులు సుమారు వంద మంది పాల్గొన్నారు. దీంతో రెండు కి.మీ పొడవునా వాహనాలు నిలిచిపోయినావి. బస్సుల సంఖ్య పెంచుతామని అధికారులు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.