బస్సు ఢీకొని మహిళ మృతి

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన విషాద సంఘటన గురువారం నగరంలో చోటుచేసుకుంది. విూర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బాలాపూర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద శారద(40) అనే మహిళ రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడకక్కడే మృతిచెందింది. విూర్‌పేట పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఈ ఘటనతో భయం చెందారు. బస్సులో ప్రయాణికులు ఒక్కసారిగా కుదపునకు గురయ్యారు.