బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక గడ్డం వెంకటరెడ్డి

మాడుగులపల్లి, జూన్ 23 (జనం సాక్షి): నల్గొండ జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ రైతు నాయకుడు గడ్డం వెంకటరెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు ఆయన గత పదవీ కాలంలో జిల్లావ్యాప్తంగా రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ బలోపేతానికి చేసిన విశేష సేవలను గుర్తించిన బిజెపి అధిష్టానం ఈ బాధ్యతలను మరోసారి ఆయనకే అప్పగించింది ఈ సందర్భంగా గడ్డం వెంకటరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, కిసాన్ మోర్చా శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలోని సాగునీరు, ఎరువుల కొరత, మద్దతు ధర వంటి రైతాంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలను జిల్లాలోని ప్రతి గ్రామానికి, రైతుకూలీకి చేరేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు వెంకటరెడ్డి రెండోసారి అధ్యక్షుడిగా నియామకమవడం పట్ల మాడుగులపల్లి మండల కేంద్రంతో పాటు ఆయన స్వగ్రామమైన చెరువుపల్లి గ్రామం లో బిజెపి శ్రేణులు, స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు మండల కేంద్రంలో నాయకులు ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు వెంకటరెడ్డి నాయకత్వంలో జిల్లాలో కిసాన్ మోర్చా మరింత బలోపేతం అవుతుందని స్థానిక నాయకులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



