సిరికొండ మండల ఉప సర్పంచ్‌ల ఫోరం ఏర్పాటు

అధ్యక్షుడిగా రొక్కం సంపత్ రెడ్డి ఎన్నిక
సిరికొండ జూన్ 22 (జనం సాక్షి): ఉప సర్పంచ్‌ల ఐక్యత, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం లక్ష్యంగా సిరికొండ మండల ఉప సర్పంచ్‌ల ఫోరంను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఫోరం అధ్యక్షుడిగా రొక్కం సంపత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా అయినాల శ్రీకాంత్, గ్యామ శోభన్, ప్రధాన కార్యదర్శిగా పల్లికొండ నవీన్, కోశాధికారిగా ధోని మోహన్, కార్యదర్శులుగా కర్రోళ్ల గంగాధర్, బాదావత్ మోహన్, నాగుల రాజేశ్వర్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉప సర్పంచ్‌ల హక్కుల సాధన, వారి సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధిలో ఉప సర్పంచ్‌ల పాత్రను మరింత బలోపేతం చేసేందుకు ఫోరం కృషి చేస్తుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్‌లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉప సర్పంచ్‌లు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ మండల వ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం



